: పత్తి రైతులకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర పెంచడం లేదు: కేంద్ర జౌళి శాఖ


పత్తి రైతులకు ఈ ఏడాదిలో గిట్టుబాటు ధర పెంపు ఉండబోదని కేంద్ర జౌళి శాఖ అదనపు కార్యదర్శి పుష్ప సుబ్రమణ్యం తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి గిట్టుబాటు ధర పెంపు విషయంపై ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. భారత పత్తి సంస్థ ఛైర్మన్ బికె మిశ్రాతో కలసి ఆమె వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ లోని రైతులకున్న సౌకర్యాలు, మార్కెట్లోని పరిస్థితులను పరిశీలించారు. గన్నీ సంచుల్లో తెచ్చిన పత్తిని సైతం కొనుగోళ్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కార్యదర్శి పుష్ప తెలిపారు.

  • Loading...

More Telugu News