: భారీగా విరిగిపడ్డ కొండచరియలు!
భారీగా కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారి-21 మూసుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లోని మాందీ జిల్లాలో ఉన్న హనోగి ఆలయం సమీపం వద్ద ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ఉన్న రాళ్లను, మట్టిని తొలగించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) రంగంలోకి దిగింది. హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ సహకారంతో ఎన్ హెచ్ఏఐ సభ్యులు రహదారి మరమ్మతులు చేపడుతున్నారు. కాగా, మనాలి వెళ్లాల్సిన వాహనాలను మాందీ-కొటాలా-బజ్జూరా మార్గం ద్వారా మళ్లించారు.