: టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల ప్రోత్సాహకాలు... ఒంటిమిట్ట ఆలయానికి వంద కోట్లు
టీటీడీ పాలకమండలి ఇవాల్టి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఈ ప్రకారం టీటీడీలో శాశ్వత ఉద్యోగులకు రూ.12,200, ఒప్పంద ఉద్యోగులకు రూ.6,100 ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది. ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా రూ.20 కోట్లు టీటీడీ విడుదల చేసింది. దేవుని కడపలో భవన సముదాయం నిర్మాణానికి రూ.5 కోట్లు, రాఘవేంద్ర స్వామి మఠానికి తిరుమలలో 10వేల చదరపు అడుగుల స్థలం కేటాయించారు. భారీ వర్షాలతో నీటమునిగిన చెన్నైలో బాధితులను ఆదుకునేందుకు వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.