: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రహానె...మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్!
భారత్ - దక్షిణాఫ్రికాల నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-0తో సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అశ్విన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రహానె నిలిచారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ ఆమ్లా మాట్లాడుతూ, భారత్ లోని స్పిన్ పిచ్ లపై తమకు అనుభవం లేని కారణంగానే ఓటమి పాలయ్యామన్నారు. అయితే, టీ 20, వన్ డే సిరీస్ లను గెలుచుకున్న ఆనందంతో స్వదేశానికి వెళుతున్నామన్న తృప్తి ఉందన్నారు. అనంతరం భారత్ కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ, సమష్టి కృషి వల్లే తాము విజయం సాధించామన్నారు. అశ్విన్, జడేజా, ఉమేష్ యాదవ్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఈ రోజు జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ 337 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది.