: ఉగ్రవాదం నుంచి తమ వారిని రక్షించుకునేందుకు నడుం బిగించిన జపాన్


ఉగ్రవాదం బారి నుంచి జపనీయులను రక్షించుకునేందుకు ఆ దేశం నడుం బిగించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతుండడానికి తోడు తమ దేశ పౌరులను అత్యంత పాశవికంగా హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జపాన్, 2016 ఏప్రిల్ 16 నుంచి అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమాచార కేంద్రాన్ని ప్రారంభించాలని తొలుత భావించింది. అయితే, పారిస్ దాడుల తరువాత ఆలస్యం చేస్తే పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉందని భావించిన జపాన్, మరో వారం రోజుల్లోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి సమాయత్తమవుతోంది. దీనిని టోక్యోలో ఏర్పాటు చేయనున్నారు. మరో 20 దేశాల్లోని ప్రతినిధులను ఈ సంస్థకు అనుసంధానిస్తారు. ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర, పశ్చిమ ఆఫ్రికాల్లోని వివిధ దేశాల్లో ఉండే జపాన్ వాసులకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందించనుంది. వారు దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని వారిని హెచ్చరించనుంది. ఈ సమాచారం అంతర్జాతీయంగా వివిధ దేశాలతో జపాన్ పంచుకోనుంది.

  • Loading...

More Telugu News