: విజయవాడ కల్తీ మద్యం ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
విజయవాడ కృష్ణలంకలో జరిగిన కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ కూడా జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. కాగా, అంతకుముందు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైన బాధితులను వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పరామర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.