: బ్లేడుతో గొంతు, చేతులు కోసుకున్న కానిస్టేబుల్... పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యాయత్నం
నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం కలకలం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గౌస్ బ్లేడుతో గొంతు, చేతులను కోసేసుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో వెనువెంటనే తేరుకున్న సహచరులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ లోనే గౌస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఈ ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.