: గవర్నర్ తో ఏపీ స్పీకర్ భేటీ... నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. హైదరాబాదులోని రాజ్ భవన్ కు వచ్చిన కోడెల గవర్నర్ తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం శతాద్ది ఉత్సవాలు ఈ నెల 11 నుంచి జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ ను కోడెల ఆహ్వానించారు. ఇందుకోసమే కోడెల రాజ్ భవన్ కు వెళ్లారు. ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని సంకల్పించిన కోడెల ఇప్పటికే విపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.