: సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్ కు అస్వస్థత
సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా బర్దన్ పక్షవాతంతో బాధపడుతున్నారని సీపీఐ నేత అతుల్ అంజాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.