: మేయర్ దంపతుల హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్... చింటూకు ఆయుధాలు అందించారని ఆరోపణ
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కేసులో కీలక నిందితుడు, కఠారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ కు ఆయుధాలు సమకూర్చారన్న ఆరోపణలపై రజనీకాంత్, నరేంద్ర బాబు, శ్రీనివాసాచారి, కమలాకర్ లను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నలుగురూ చింటూకు ఆయుధాలతో పాటు వాహనాలను సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఓ పిస్టల్, బురఖా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.