: చెన్నై వరద బాధితులకు 'మా' విరాళం 5 లక్షలు


చెన్నై వరద బాధితులకు అండగా నిలిచేందుకు సినీ నటులు ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకే మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి సినీ నటులు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది వరకే 'మా' బిడ్డల్లాంటి కొందరు హీరోలు విరాళాలు ప్రకటించారని, తాజాగా చెన్నై బాధితులకు అండగా నిలిచేందుకు 'మా' అసోసియేషన్ తరపున 5 లక్షల రూపాయల విరాళం అందజేస్తామని 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కాగా, నేడు హైదరాబాదులోని ఇనార్బిట్ మాల్, హైదరాబాదు సెంట్రల్, సిటీ సెంట్రల్ వంటి షాపింగ్ మాల్స్ లో సినీ నటులు గ్రూపులుగా ఏర్పడి విరాళాలు సేకరించారు. వీరందరినీ సినీ నటుడు రానా, నవదీప్ సమన్వయం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News