: థ్యాంక్యూ మి లార్డ్స్... చీఫ్ జస్టిస్ కు కేజ్రీవాల్ కృతజ్ఞతలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ కాలుష్యానికి పరిష్కారంగా కేజ్రీవాల్ ప్రతిపాదించిన సరి సంఖ్య, బేసి సంఖ్యల ఫార్ములాకి చీఫ్ జస్టిస్ ఠాకూర్ మద్దతు పలికారు. కారు లేని రోజున బస్సులో న్యాయస్థానానికి వెళ్తానని, అదీ లేని రోజున నడిచే వెళ్తానని, అందులో ఇబ్బంది ఏముందని ఆయన పేర్కొన్నారు. దీనికి సోషల్ మీడియా ద్వారా కేజ్రీవాల్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ జస్టిస్ అభిప్రాయం లక్షలాది మంది ప్రజలకు, ప్రభుత్వం సంస్కరణలు చేపట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. 'థ్యాంక్యూ మి లార్డ్స్' అంటూ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.