: పాతబస్తీలో డీజేఎస్ కార్యకర్తల అరెస్టు
హైదరాబాదులోని పాతబస్తీలో డీజేఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ డేను పురస్కరించుకుని హైదరాబాదులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దారుల్ షిఫా ప్రాంతంలో డీజేఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మసీదు బయటకు వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని డబీపురా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా నేడు బ్లాక్ డే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.