: కళ్లు తెరవండి...కోర్టును అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది: కారెం శివాజీ


అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసే ప్రయత్నాలు మరింత వేగవంతమయ్యాయని మాల మహానాడు నేత కారెం శివాజీ తెలిపారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్న దొంగతనం చేస్తేనే పట్టుకుని లోపలేసి తాట తీసే పోలీసులు, అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం జోలికి ఎందుకు వెళ్లడం లేదో ఆలోచించాలని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని ఆపేందుకు కుయుక్తులు ప్రారంభమయ్యాయని, తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆందోళనలకు అంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 40 వేల మందిని అగ్రిగోల్డ్ మోసం చేసిందని ఆయన చెప్పారు. దీనిపై మరింత తీవ్రమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోర్టు వేలాన్ని అడ్డుకునేందుకు ఆ ఆస్తులు బ్యాంకు తనఖాల్లో ఉన్నాయని అగ్రిగోల్డ్ కొత్త డాక్యుమెంట్లు చూపుతోందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News