: చెన్నై నుంచి కదిలిన తొలి విమానం!


వరద సృష్టించిన బీభత్సం తరువాత చెన్నై విమానాశ్రయం నుంచి తొలి విమానం పోర్ట్ బ్లెయిర్ కు ఈ ఉదయం 10 గంటల సమయంలో టేకాఫ్ అయింది. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ, ఈ ఎయిర్ ఇండియా విమానం సేఫ్ గా టేకాఫ్ అయిందని, తిరిగి 1:40కి చెన్నై చేరుకునే విమానం 2:45కు న్యూఢిల్లీ బయలుదేరుతుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానంలో ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయాణికులు భారీ సంఖ్యలో క్యూ కట్టినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న విమానాశ్రయంలోకి వరద నీరు రాగా, ఆనాటి నుంచి అన్ని సర్వీసులనూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ, డిపార్చర్ లాంజ్ తో పాటు విమానాలు నిలిపివుంచే స్థలంలో వరద నీరు తొలగలేదు. రన్ వేపై నీరు లేకపోవడంతో సాధ్యమైనన్ని ఎక్కువ విమాన సర్వీసులు నడపాలని ఏఏఐ (ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) భావిస్తోంది.

  • Loading...

More Telugu News