: దక్షిణాఫ్రికా తొలివికెట్ డౌన్


481 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఎల్గర్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో స్లిప్స్ లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. అంతకుముందు భారత్ 5 వికెట్ల నష్టానికి 267 పరుగుల స్కోరు వద్ద తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్గర్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ హసీమ్ ఆమ్లా క్రీజులోకి వచ్చి బవుమాకు జత కలిశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 5 పరుగులు. ప్రస్తుతం ఆటకు మధ్యాహ్న భోజన విరామాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News