: పతంజలి నూడిల్స్ లో పురుగులు, అధికారులకు ఫిర్యాదు


ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంస్థ నుంచి గత నెలలో మార్కెట్లోకి విడుదలైన నూడిల్స్ ప్యాకెట్లలోని ఒకదానిలో పురుగులు ఉన్నట్టు సమాచారం. హర్యానా రాష్ట్రంలోని నర్వానా సమీపంలో ఓ వ్యక్తి నూడిల్స్ కొని చూడగా, వాటిల్లో పురుగులు కనిపించాయి. ఇదే విషయంపై అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కాగా, నూడిల్స్ ప్యాకెట్ ను విక్రయించింది తామేనని, అందులో పురుగులు బయటపడ్డ విషయం తమకు తెలియదని సదరు దుకాణ యజమాని అంటున్నాడు. ఈ విషయంలో రాందేవ్ ప్రతినిధులెవరూ ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News