: 267 పరుగుల వద్ద భారత్ డిక్లేర్, సౌతాఫ్రికా లక్ష్యం 481
అజింక్యా రహానే అద్భుత సెంచరీతో సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ధోనీ వంటి వారెవరికీ సాధ్యంకాని ఫీట్ ను సాధించిన మరుక్షణం కోహ్లీ భారత ఇన్నింగ్స్ ను 267 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఒక టెస్టు మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు కొట్టిన ఐదవ బ్యాట్స్ మన్ గా రహానే నిలిచిన సంగతి తెలిసిందే. రహానే 100 పరుగుల మైలురాయిని తాకగానే కోహ్లీ ఇన్నింగ్స్ ను ముగిస్తున్నట్టు సైగ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ముందు 481 పరుగుల భారీ లక్ష్యం మిగిలింది. లంచ్ విరామానికి 30 నిమిషాల ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ కాగా, మరికాసేపట్లో భారీ లక్ష్యాన్ని అందుకునేందుకు దక్షిణాఫ్రికా తన తుది ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.