: అరెస్టయిన ఐఎస్ఐ ఉగ్రవాది సోదరుడితో క్రికెటర్ అఫ్రీది!


గతవారంలో భారత పోలీసులు అదుపులోకి తీసుకున్న పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాది మహమ్మద్ ఇజాజ్ సోదరుడు ఫవాద్, ఆ దేశ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కలిసున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇజాజ్ కు శిక్షణ ఇచ్చిన ఐఎస్ఐ, ఆపై ఉగ్రదాడుల కుట్రలో భాగంగా ఇండియాకు పంపగా, యూపీలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని సోదరుడు, అఫ్రీది కలిసున్న ఫోటోలు బహిర్గతం కావడంతో, పోలీసులు వాటిని పరిశీలిస్తున్నట్టు సీఎన్ఎన్ ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్ ఐఎస్ఐ గూఢచర్య రాకెట్లో భారత సైన్యాధికారి ఒకరు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News