: చంద్రబాబు ఇంటికి వెళ్లనున్న కేసీఆర్!


నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరోసారి కలవనున్నారు. తాను నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు కేసీఆర్ స్వయంగా ఆయనింటికి వెళ్లనున్నట్టు సమాచారం. నేడు, రేపు హైదరాబాద్ లోనే ఉండే చంద్రబాబు బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇంట జరిగే శుభకార్యంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. దివంగత ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి కుమారుడి వివాహం నిన్న జరుగగా, చంద్రబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ, చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ను ఆహ్వానించగా, బాబు కోరిక మేరకు కేసీఆర్ అమరావతికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించి, వారిని టీఆర్ఎస్ లోకి చేర్చుకున్న నేపథ్యంలో కేసీఆర్ పిలిచినా వెళ్లరాదని పార్టీలోని కొన్ని వర్గాలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News