: గిన్నిస్ రికార్డులకెక్కిన 'నగదు బదిలీ'


భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంట గ్యాస్ నగదు బదిలీ పథకం గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పథకాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకంగా గుర్తిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి వచ్చిన ధ్రువపత్రాన్ని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ పథకాన్ని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు 2013 సెప్టెంబరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపై మోదీ సర్కారు దీనికి 'పహల్' అని పేరు మార్చి ఈ సంవత్సరం ఆరంభం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ నెల 3వ తేదీ నాటికి 14.62 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారులు ఈ స్కీములో చేరి సబ్సిడీని నగదు బదిలీ రూపంలో నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి చేర్చుకుంటున్నారని గిన్నిస్ బుక్ నిర్వాహకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News