: 70 టన్నుల బొగ్గు తగలబడిపోయింది!
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 70 టన్నుల బొగ్గు తగలబడిపోయిన సంఘటనలో సుమారు కోటిన్నర మేరకు నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి నుంచి బొగ్గుతో నింపిన రైల్వే వ్యాగన్లను తరలిస్తున్నారు. రామగుండం రైల్వేస్టేషన్ వద్ద ఓ బొగ్గు వ్యాగన్ లో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు మరో మూడు వ్యాగన్లకు వ్యాపించాయి. దీంతో, అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనపై సింగరేణి అధికారులు మాట్లాడుతూ, సుమారు రూ.1.50 కోట్ల మేరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు.