: దక్షిణాఫ్రికాలో ముగ్గురు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి... 27 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని చాద్‌లో ముగ్గురు ఉగ్రవాదులు ఈరోజు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో 27 మందికి పైగా మృతి చెందగా, 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి 'లొవులొవు'లో వారాంతపు సంత జరుగుతుంది. ఈరోజు జరిగిన సంతలో ముగ్గురు ఉగ్రవాదులు ఒకేసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, గత నెలలో చాద్ లో బొకో హరామ్ తీవ్రవాదులు దాడులు జరిపారు. దీంతో అత్యవసర పరిస్థితిని విధించిన విషయం తెలిసిందే.