: ఇండొనేషియా ఓపెన్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్
భారత నంబర్ వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సత్తా చాటాడు. ఇండొనేషియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో ఇండొనేషియా ప్లేయర్ (39వ ర్యాంక్) జిన్ టింగ్ ఆంథోనీపై 21-13, 21-19 తేడాతో శ్రీకాంత్ గెలుపొందాడు. తొలి సెట్ ను సులువుగా కైవసం చేసుకున్న శ్రీకాంత్ కు... రెండో సెట్లో జిన్ టింగ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మరో సెమీస్ లో టామీ సుగియార్టో, విష్ణు ప్రసెట్టోలు తలపడుతున్నారు. ఈ మ్యాచ్ లో గెలుపొందే ఆటగాడితో ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు.