: కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కు తీసుకురావాలన్న పిటిషన్ తిరస్కరణ


కోహినూర్ వజ్రానికి సంబంధించి పాక్ న్యాయవాది జావెద్ ఇక్బాల్ జఫ్రీ లాహోర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆ వజ్రాన్ని పాకిస్థాన్ కు తీసుకువచ్చేలా ఆదేశించాలన్న న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ విచారణకు అనర్హమైనదిగా పేర్కొంటూ కొట్టివేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-11 కిరీటంలో ఉంది. ఈ నేపథ్యంలో న్యాయవాది వేసిన పిటిషన్ లో ఆమెను, పాక్ లోని బ్రిటిష్ హైకమిషన్ ను ప్రతివాదులుగా చేర్చారు.

  • Loading...

More Telugu News