: నల్గొండ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెరొకటి


తెలంగాణలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చెరొకటి గెలుచుకున్నాయి. నల్గొండ జిల్లా ఆలేరు మండలం అమ్మనబోలు గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. 178 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. గతంలో ఈ పంచాయతీ టీఆర్ఎస్ అధీనంలో ఉండేది. అప్పటి సర్పంచ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తాజా ఉపఎన్నికలో మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి తన స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఇదే జిల్లాలోని మోత్కూరు మండలం మానాయకుంట గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఈ జిల్లాలోని 9 గ్రామపంచాయతీలకు ఇవాళ ఉపఎన్నికలు జరిగాయి. పైరెండు పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఇవాళ జరగాల్సిన రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట జడ్పీటీసీ ఎన్నిక ఆగిపోయింది. యతరాజ్ పల్లి, తిమ్మారెడ్డి, కేశవపల్లి గ్రామాల్లో ఓటర్ల లిస్టులో వెయ్యి ఓట్లు గల్లంతయ్యాయి. దాంతో గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు.

  • Loading...

More Telugu News