: ఇసుక అక్రమాల్లో లోకేశ్ కూ వాటా అందుతోంది: అంబటి
ఏపీలో ఇసుక అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం పాల్పడుతున్న ఇసుక అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. వారితో పాటు నారా లోకేశ్ కు కూడా వాటా అందుతోందని హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి 3వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఇసుక ధరను 17 శాతం ప్రభుత్వం పెంచిదన్నారు. తీరా ప్రభుత్వ ఖజానాకు 500 కోట్లు మాత్రమే వచ్చినట్టు అబద్ధాలు చెబుతోందని అంబటి ఆగ్రహించారు. ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అడిగారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏకాభిప్రాయం కావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మెలికపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఏకాభిప్రాయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు.