: సత్తా చాటిన కేశినేని... బెజవాడ సభలో నాని వన్ మ్యాన్ షో!


తన తాత ప్రారంభించిన ‘కేశినేని ట్రావెల్స్’ను కేశినేని నాని (కేశినేని శ్రీనివాస్) కఠోర శ్రమతో దేశంలోనే ఇంటర్ సిటీ ట్రాన్స్ పోర్టేషన్ లో అతిపెద్ద సంస్థగా తీర్చిదిద్దారు. తాజాగా రాజకీయ తెరంగేట్రం చేసిన నాని తొలి యత్నంలోనే విజయవాడ ఎంపీగా విజయం సాధించి సత్తా చాటారు. వెనువెంటనే నగరాభివృద్ధిపై తనదైన శైలిలో ఆయన దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో తన సొంత పార్టీకి చెందిన మంత్రులతో ఢీకొట్టేందుకు కూడా ఆయన వెనుకాడలేదు. నగర ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందని భావిస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ పై దృష్టి సారించిన నేత నిన్నటిదాకా ఎవరూ లేరనే చెప్పాలి. అయితే అందుకు భిన్నంగా కేశినేని లెక్కలేనన్ని సార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ కార్యాలయాల చుట్టూ ఫైళ్లు పట్టుకుని తిరిగారు. ఎట్టకేలకు ఫ్లైఓవర్ ను సాధించేశారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ శంకుస్థాపనకు ఏకంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయవాడ రప్పించగలిగిన ఆయన, బెంజి సర్కిర్ ఫ్లైఓవర్ తో పాటు విజయవాడ రింగురోడ్డుకు కూడా కేంద్రం నుంచి ప్రకటన చేయించారు. నితిన్ గడ్కరీతో పాటు మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న విజయవాడ సభలో కేశినేని నాని వన్ మ్యాన్ షో నడిచింది. ఈ సందర్భంగా నాని అకుంఠిత దీక్షను సాక్షాత్తు నితిన్ గడ్కరీ సభాముఖంగా కీర్తించారు. పనులకు అనుమతి కోసం నాని తన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News