: రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా... రోహిత్ డకౌట్
సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 213 పరుగుల భారీ లీడ్ సాధించిన టీమిండియా... సఫారీలను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే, ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే భారత్ రెండు వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. 4 పరుగుల వద్ద మురళీ విజయ్ (3) మోర్కెల్ బౌలింగ్ లో విలాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పెళ్లికొడుకు రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే మోర్కెల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కూడా కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రోహిత్ నిరాశపరిచాడు. మరోవైపు, శిఖర్ ధావన్ 17, పుజారా 23 పరుగులతో సమయానుకూలంగా ఆడుతూ, ఆధిక్యాన్ని పెంచే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు. దీంతో, టీమిండియా లీడ్ 257 పరుగులకు చేరింది.