: వెంకయ్యనాయుడుతో భేటీ అయిన బిల్ గేట్స్


మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్ లో వీరి సమావేశం జరిగింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై వీరు ఇరువురూ చర్చించుకున్నారు. దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం ఎలా తీసుకురావాలన్న అంశంపై చర్చ జరిపారు. ఒక మంచి కార్యక్రమం కోసం భారత ప్రభుత్వంతో కలసి పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని సమావేశం అనంతరం బిల్ గేట్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News