: ఇండియాలో దూరదర్శన్ చూస్తున్న వారి సంఖ్య 59.6 కోట్లట!
దూరదర్శన్... కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధీనంలోని ప్రసార భారతి నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారిక టెలివిజన్ చానల్ గ్రూప్. తాజా గణాంకాల ప్రకారం, ఇండియాలో 59.6 కోట్ల మంది దూరదర్శన్ ప్రసారాలను వీక్షిస్తున్నారట. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) గణాంకాల ప్రకారం, డీడీ చానళ్లలో 9.9 కోట్ల వ్యూవర్ షిప్ తో డీడీ పంజాబీ తొలి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ఓ సభ్యుడడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. డీడీ వార్తా చానల్ ను 2.1 కోట్ల మంది చూస్తున్నారని తెలిపారు. ఈ గణాంకాలు గడచిన ఆరు వారాల్లోనివని ఆయన వివరించారు. కాగా, గ్రామాన కేబుల్ చానళ్లు విస్తరించిన వేళ దూరదర్శన్ కార్యక్రమాలను దాదాపు 60 కోట్ల మంది చూస్తుండటం గమనార్హం.