: నివురు గప్పిన నిప్పులా ఓయూ... ఆంక్షలు విధించిన పోలీసులు
ఉస్మానియా యూనివర్శిటీ నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వామపక్ష, దళిత, మైనార్టీ విద్యా సంఘాలు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో... కచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఏబీవీపీ, గో రక్షక సమితిలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో వర్శిటీలో వాతావరణం వేడెక్కింది. యూనివర్శిటీలో ఎలాంటి ఫెస్టివల్ కు అనుమతి లేదని ఈస్ట్ జోన్ డీసీపీ రవీంద్ర స్పష్టం చేశారు. అంతేకాక, యూనివర్శిటీలో ఆంక్షలు విధించారు. మరోవైపు, ఇరుపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు.