: తెలంగాణ ప్రభుత్వం మతపరమైన పండుగలు చేయడం అనవసరం: సురవరం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం పలు మతాలవారి పండుగలు అధికారికంగా నిర్వహించడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రభుత్వం మతాల పండుగలు చేయడం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఇక సీఎం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ యాగాన్ని ప్రభుత్వపరంగా చేస్తున్నారా? లేక సొంతంగా చేసుకుంటున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో కొంచెం అసహనముందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒప్పుకోవడం సంతోషమన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలసి సురవరం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు చాడ చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుల వలసలను ప్రోత్సహించడం దారుణమని అన్నారు.