: 'నువ్వు లేకపోతే నేను లేను' అంటున్న పవన్ కల్యాణ్ కుమారుడు


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తన తల్లిమీద ప్రేమనంతా లేఖ రూపంలో వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలు తన తల్లికి ఫ్రూట్ కేక్ తయారు చేశారు. అకీరా తన తల్లికి లేఖ రాశాడు. 'నువ్వు లేకపోతే నేను ఈ లోకంలోకి వచ్చి ఉండేవాడిని కాదని, నువ్వే లేకపోతే ప్రేమ, దయ, స్నేహం అనే వాటికి అర్థం తెలిసేది కాదని, నువ్వు గొప్ప అమ్మవి' అని చెబుతూ తల్లి మనసును గెలుచుకున్నాడు. దీనిని చదివిన రేణూ దేశాయ్ ఉబ్బితబ్బిబైపోయి తన పిల్లలు చెప్పిన శుభాకాంక్షలు, అకీరా రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

  • Loading...

More Telugu News