: చెన్నైలో మళ్లీ వర్షం... ఆందోళనలో బాధితులు
చెన్నైలో మళ్లీ వర్షం పడుతోంది. దాంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితులు ఆందోళన పడుతున్నారు. తాంబరం, చెంగల్ పట్టు, మౌంట్ రోడ్, మైలాపూర్, శ్రీనగర్, కేకేనగర్, తిరువళ్లూరు, కాంచీపురం పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దాంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అంతకుముందు కురిసిన వర్షాల కంటే ఇవి చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చని చెప్పింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.