: కుప్పకూలుతున్న సౌతాఫ్రికా... 65 పరుగులకే 5 వికెట్లు
జడేజా స్పిన్ మాయాజాలం, ఉమేష్ యాదవ్ పదునైన బంతులకు సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలుతోంది. కేవలం 65 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. కెప్టెన్ ఆమ్లా కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డూప్లెసిస్ కూడా జడేజా బౌలింగ్ లోనే రహానేకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుమినీ (1)ని ఉమేష్ క్లీన్ బౌల్డ్ చేశాడు. డివిలియర్స్ (22), విలస్ (3) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు. జడేజా 3 వికెట్లు పడగొట్టగా, ఉమేష్ 2 వికెట్లు తీసుకున్నాడు.