: చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్
వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి శ్రీకాళహస్తి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రేణిగుంట విమానాశ్రయ అధికారిపై దాడి చేసిన కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మొదటి ముద్దాయి కాగా, చెవిరెడ్డి రెండో ముద్దాయిగా ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశారు. గత నెల 26వ తేదీన ఎయిర్ పోర్టులో చెకింగ్ సమయం అయిపోయిన తర్వాత కూడా తన బంధువులకు సంబంధించిన వారిని లోపలకు అనుమతించాలని డ్యూటీలో ఉన్న అధికారిపై మిథున్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. అయితే సదరు అధికారి అందుకు అనుమతించలేదు. దీంతో ఆయనపై చెవిరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదైంది.