: కైరోలో రెస్టారెంట్ పై బాంబు దాడి... 16 మంది మృతి


ఈజిప్టు రాజధాని కైరోలోని అగూజ ప్రాంతంలో ఉన్న ఒక నైట్ క్లబ్ పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలో సుమారు 16 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు ఈజిప్టు అధికారులు తెలిపారు. నైట్ క్లబ్ సెక్యూరిటీ సిబ్బంది ప్రకారం, క్లబ్ కు వచ్చిన కొంతమంది యువకులకు, సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. కాగా, ఈ సంఘటనపై మరో కథనం కూడా వినపడుతోంది. మాస్కులు ధరించి వచ్చిన ముగ్గురు అగంతుకులు నైట్ క్లబ్ లోకి చొరబడ్డారు. పెట్రోల్ బాంబును విసిరి అక్కడి నుంచి పారిపోయి నట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. అయితే, ఈ సంఘటనకు కారకులెవరన్న విషయం ఇంకా తెలియలేదని కైరో పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News