: 'హృదయం'పై సంతకం... ఇక స్నానం చేసేది లేదంటున్న యువతి!
త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగుతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన దైన శైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. వర్జీనియాలోని ప్రిన్స్ విలియమ్ కంట్రీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆటోగ్రాఫ్ కోరిన యువతి గుండెలపై ఆయన సంతకం చేశారు. ట్రంప్ సంతకం పెడుతున్న దృశ్యాల వీడియో, చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆటోగ్రాఫ్ తీసుకున్న తరువాత, ఇక తాను స్నానం చేసేదే లేదంటూ, ఆ యువతి వ్యాఖ్యానించిందట. కాగా, అమెరికాలో ట్రంప్ కు మద్దతు నానాటికీ పెరుగుతుండగా, అందులో మహిళా అభిమానుల సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.