: ప్రపంచానికి మన బలం తెలియాలి: మోదీ


ప్రపంచ దేశాలకు భారత సత్తా ఏంటో తెలియాల్సివుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న హెచ్టీ నాయకత్వ సదస్సులో ప్రసంగించిన ఆయన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ఇండియా ఏం చేయగలుగుతుందన్న విషయం ఇతర దేశాలకు చేరుతుందని అన్నారు. భారత అభివృద్ధి పథంలో రాష్ట్రాలు కలసి రావాలని, ఆ దిశగా కేంద్రం పలు చర్యలను ఇప్పటికే తీసుకుందని తెలిపారు. "ముందడుగు ఢిల్లీ నుంచి కాదు. రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల నుంచి పడాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాలి" అని ఆయన అన్నారు. ఇండియాలో వ్యాపార సూచిక మెరుగుపడినట్టు ఇటీవల కొన్ని రీసెర్చ్ సంస్థలు ప్రకటించిన ర్యాంకులను మోదీ ఉదాహరణలుగా చూపుతూ, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యాపారాన్ని మరింత సులభతరం చేశారని మోదీ అన్నారు. స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగితేనే ఇది సాధ్యమన్న విషయాన్ని మరువరాదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News