: కేసీఆర్ కు సవాల్ విసిరిన మాగంటి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హైదరాబాదు, జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం కాదు... దమ్ముంటే వారితో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా... ఇతర పార్టీల నేతలకు వల వేసే పనిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను కూడా మాగంటి వదల్లేదు. గత ఎన్నికల్లో సాయన్న సొంత బలంతో గెలవలేదని, టీడీపీ బలంతోనే గెలిచారని ఎద్దేవా చేశారు. సాయన్న పార్టీని వీడినా, టీడీపీకి ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు.