: మా నాన్న ప్రధాని, రాహుల్ ఉపప్రధాని... అలాగైతే పొత్తుకు సిద్ధం: సీఎం అఖిలేష్


తాను పెట్టే రెండు షరతులకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు పొత్తుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘రాహుల్ జీ మాకు పాత మిత్రుడు. రెండు షరతులకు వారు అంగీకరిస్తే, పొత్తుకు సిద్ధంగా ఉన్నాము. అవేమిటంటే, నా తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ప్రధానమంత్రి పదవి, రాహుల్ కు ఉప ప్రధాని పదవి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన పక్షంలో ఆ పార్టీతో పొత్తుకు రెడీ’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

  • Loading...

More Telugu News