: హమ్మయ్య... ఇది శుభవార్తే: నరేంద్ర మోదీ


ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "పార్లమెంట్ ఇప్పుడు పనిచేస్తోంది. ఇది శుభవార్తే. ఆ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోదీది కాదు, అన్ని రాజకీయ పార్టీలది" అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వారం ప్రారంభంలో వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దేశంలో అసహనం అంశాలపై పార్లమెంటులో వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లులను ఎలాగైనా ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని భావిస్తున్న కేంద్రం, ఇప్పటికే పలు విపక్ష పార్టీలతో చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను ప్రత్యేకంగా టీ పార్టీకి అహ్వానించిన మోదీ వారితో జీఎస్టీ బిల్లుపై చర్చించారు కూడా. ఇక ఆ బిల్లు సంగతి ఏమవుతుందో సమావేశాలు ముగిసేలోగా తేలనుంది.

  • Loading...

More Telugu News