: దీపాలంకారం మినహా అన్నీ హాంఫట్!


జనవరి నెలలో శ్రీవారి సేవలకు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉదయం అందుబాటులోకి తెచ్చిన 26,063 టికెట్లలో అత్యధికం గంటన్నర వ్యవధిలో అయిపోయాయి. ఉదయం 11 గంటలకు టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా, గతంలో మాదిరిగా సర్వర్ డౌన్ కాకుండా చర్యలు చేపట్టడంలో టీటీడీ సాంకేతిక బృందం విజయవంతమైంది. అన్ని టికెట్లనూ ఒకేసారి అమ్మకానికి ఉంచకుండా, దశలవారీగా, సేవల వారిగా టికెట్లను విడుదల చేయగా, అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అర్చన, సుప్రభాతం, తోమాల సేవ, నిజపాద దర్శనం తదితరాలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. జనవరి 21, 22 తేదీలకు సంబంధించిన కోటాను మాత్రం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ విడుదల చేయలేదు. ప్రస్తుతం కొన్ని రోజులకు సంబంధించిన పదుల సంఖ్యలో కల్యాణం టికెట్లతో పాటు సహస్ర దీపాలంకార సేవకు సంబంధించిన 300 వరకూ టికెట్లు మిగిలినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలకు ఒకటి, రెండు టికెట్లు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News