: నానబెట్టిన ‘బాదం’తో ఆరోగ్యం!


ఆరోగ్యానికి బాదంపప్పు (ఆల్మండ్) మంచిది. అదే, నానబెట్టిన బాదంపప్పు అయితే మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ ఈ, పీచు (ఫైబర్) పదార్థం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది. అయితే... నీళ్లలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే, బాదంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా ఆ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవరులో స్టోర్ చేయాలి. అలా వాటిని దాదాపు ఒక వారం రోజుల పాటు వీటిని తినవచ్చు. నానబెట్టిన బాదంతో కలిగే లాభాలు... * జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది * అధిక బరువును తగ్గిస్తుంది. * గుండె ఆరోగ్యం పదిలంగా వుంటుంది * చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది * యాంటిఆక్సిడెంట్లు లభిస్తాయి * కేన్సర్ వ్యాధిని దరిచేరనీయకుండా ఉంచుతుంది * ట్యూమర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు * శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది * పుట్టుకతో వచ్చిన లోపాల నివారణకు (నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఈ పనులను చక్కబెడుతుంది)ఉపయోగపడుతుంది.

  • Loading...

More Telugu News