: చెన్నై వాసులకు వెంకయ్యనాయుడు హేట్సాఫ్
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నై వాసులకు హేట్సాఫ్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటుండడంపై ఆయన ముగ్ధులయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. వరదల్లో చిక్కుకున్న తోటివారికి చెన్నై వాసులు తమ వంతు సాయం చేస్తున్నారని, వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న చెన్నై వాసులకు హేట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. ఇటువంటి సమయంలో ప్రతిఒక్కరూ తప్పకుండా నిరాశ్రయులకు సాయం చేయాలని వెంకయ్య కోరారు. ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు చెన్నై వాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా సైట్లలో కావాల్సిన సమాచారం ఇస్తున్నారు. బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.