: కేసీఆర్, కవితలపై మావోయిస్టుల పోస్టర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె, ఎంపీ కవిత బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో పోస్టర్లు వెలిశాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలను కట్టబెట్టిన ప్రజల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కూడా పరామర్శించడం లేదని మండిపడ్డారు. ఇటీవల కాలంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువైందనే విషయం కలకలం రేపుతోంది. ఈ సమయంలో మావోయిస్టుల పోస్టర్లు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.