: ఓ వైపు వరదనీరు ముంచెత్తుతుంటే, జయలలిత 'బాహుబలి' పోస్టర్... నెటిజన్ల విమర్శలు!
తమిళనాట జయలలితపై నాయకులు, కార్యకర్తల నుంచి ప్రజల వరకూ చూపే అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాజాగా ఓ చోటా నేత చెన్నై వీధుల్లో పెట్టిన ఓ పెద్ద హోర్డింగ్ విమర్శలకు దారితీసింది. ఓ వైపు చెన్నై నగరం వరద నీటిలో మునిగి వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వందల సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన వేళ, 'చెన్నైని కాపాడే అమ్మ' అంటూ, బాహుబలి చిత్రంలో శివగామి (రమ్యకృష్ణ) పాత్ర, ఓ చిన్నారిని చేత పట్టుకుని నది దాటే సన్నివేశ చిత్రాన్ని ప్రతిబింబించేలా జయలలిత చిత్రాన్ని తయారు చేయించారు. భారీ వరద నీటి మధ్య జయలలిత తన చేతుల్లో చిన్నారిని ఎత్తుకున్నట్టు చూపిస్తూ, తమిళ ప్రజలను అలాగే 'అమ్మ' కాపాడుతుందంటూ, ఈ హోర్డింగును ఏర్పాటు చేసి, సదరు నేత తన అభిమానాన్ని చాటుకున్న వైనం విమర్శలకు తావిచ్చింది. ఆ భారీ హోర్డింగును మీరూ చూడండి.