: ఈ నెల 21, 22న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నాం: టీటీడీ ఈవో
ఈ నెల 21, 22 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఆ రోజుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తున్నామని చెప్పారు. ఈ ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీవరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఉత్సవాలకు భక్తకోటి తరలిరావాలని పిలుపునిచ్చారు. జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు 26వేల వరకు విడుదల చేసినట్టు వెల్లడించారు.