: సోమవారం టీఆర్ఎస్ లో చేరనున్న దానం!
మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. సోమవారం నాడు ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. నిన్న రాత్రి టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ నివాసంలో దానం మంతనాలు జరిపారు. ఈ భేటీకి పద్మా దేవేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరోవైపు, దానంకు మేయర్ పదవి లేదా హెచ్ఎండీఏ ఛైర్మన్ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.